రేపు సీఎం జగన్ విజయవాడ, నెల్లూరు పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడ, నెల్లూరు జిల్లాలలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు హాజరుకానున్నారు సీఎం. అనంతరం నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు.

ఈ పర్యటనకు సీఎం జగన్ రేపు ఉదయం 11.50 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 1.00 గంటల వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు హాజరవుతారు. ఆ తర్వాత 2.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.25 గంటలకు నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు కి చేరుకుంటారు. సాయంత్రం 3.55 – 4.10 వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఇక సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.