విద్యాశాఖ పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష

-

విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు వివరించారు అధికారులు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్‌ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు అధికారులు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నామన్నారు అధికారులు.

యూనిట్‌ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో టాప్‌ 10 ర్యాంకులను 27 మంది విద్యార్ధులు సాధించినట్టు వెల్లడించారు అధికారులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలన్నారు.

ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్‌ ఉండాలని సూచించారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. వచ్చే జూన్‌ నాటికి ఈ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news