సీఎం జగన్ విజయవాడ పర్యటన ఫిక్స్ అయింది. సీఎం జగన్ రెండు రోజులు విజయవాడలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం రాజ్ భవనలో జస్టిస్ జి. నరేందర్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
![CM Jagan's visit to Vijayawada today](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/10/CM-Jagans-visit-to-Vijayawada-today.jpg)
నవంబర్ 1న విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవంలో గవర్నర్ నజీర్ తో కలిసి సీఎం పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇది ఇలా ఉండగా.. సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమోషన్ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమోషన్ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనుంది ఎస్ఐపీబీ. ఎస్ఐపీబీలో తీసుకునే నిర్ణయాలకు రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది.