రేపు సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి కావలికి బయలుదేరనున్నారు సీఎం జగన్. 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంకు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్… కావలి మిని స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా చుక్కల భూములను 22ఏ నిషేదిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఇక ఈ కార్యక్రమం అనంతరం… సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇక అటు రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు వెళ్ళనున్న సీఎం జగన్… శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొననున్నారు. అనంతరం 9.35 గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని కావలి బయలుదేరనున్నారు సీఎం జగన్.