సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటనకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 29వ తేదీన అంటే రేపే సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం వైఎస్ జగన్.

రేపు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం వైఎస్ జగన్. విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్. కాగా, ఇవాళ హాలీ డే ప్రకటించింది జగన్ సర్కార్. మిలాద్ ఉన్ నబీ పండుగ ఉన్న తరుణంలో.. ఇవాళ హాలీ డే ప్రకటించింది జగన్ సర్కార్.