ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రారంభం

-

ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ 1,719 కోట్లతో రాష్ట్రంలో 11 ఆహార శుద్ధి యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఆరు యూనిట్లు పూర్తి కావడంతో వాటిని ప్రారంభించారు సీఎం జగన్. మిగతా వాటికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పలు ఆహార ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఏటా 3.14 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుండగా.. 40,307 మంది రైతులకు మేలు జరగనుంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం అవసరమైన ముడి సరుకును రైతుల నుంచి సేకరించిన సందర్భంగా వారికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news