కొలంబో వేదికగా శ్రీలంక మరియు పాకిస్తాన్ ల మధ్యన రెండవ టెస్ట్ జరుగుతోంది . మొదటి రోజును పాకిస్తాన్ దక్కించుకోగా.. రెండవ రోజు మాత్రం వరుణుడి విజయాన్ని అందుకున్నాడు. నిన్న శ్రీలంక ను 166 పరుగులకే అల్ అవుట్ చేసిన పాకిస్తాన్ భారీ ఆధిక్యం దిశగా సాగిపోవాలి అనుకున్నా వరుణుడు వీరి ఆటలు కొనసాగనివ్వలేదు. ఈ రోజు ఆట షెడ్యూల్ ప్రకారం 90 ఓవర్లు జరగాల్సి ఉండగా, కేవలం ఉదయం సమయంలో 10 ఓవర్లు మాత్రమే ఆడదానికి సాధ్యం అయింది. వర్షం ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా ఉదయం నుడ్ని సాయంత్రం వరకు దంచి కొట్టడంతో ఇక ఆట ఈ రోజు సాధ్యం కాదని భావించిన యంపైర్లు మధ్యాహ్నమే మ్యాచ్ ను ఈ రోజుకి నిలిపివేశారు. దీనితో ఇంకా వృధా అయ్యే ఒక్కో రోజు పాకిస్తాన్ విజయానైకి బ్రేకులు అనుకోవాలి. ఎందుకంటే సాలిడ్ బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న పాకిస్తాన్ ను శ్రీలంక ఎదిరించి విజయం సాధించడం కల్ల.
మరి మూడవ రోజు అయినా వర్షం రాకుండా మ్యాచ్ జరగడానికి వీలుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.