ఏపీలో “ఇందిరమ్మ అభయం” గ్యారంటీలు అమలు చేస్తాం – వైఎస్ షర్మిల

-

ఏపీలో “ఇందిరమ్మ అభయం” గ్యారంటీలు అమలు చేస్తామన్నారు వైఎస్ షర్మిల. “ఇందిరమ్మ అభయం” గ్యారంటీ పేరుతో ప్రతి పేద ఇంటికి ప్రతి నెల ఒకటో తేదీనే 5వేల రూపాయలు.. ఏడాదికి 60వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇస్తున్నామన్నారు షర్మిల. ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన ‘న్యాయసాధన’ సభకు తరలివచ్చిన అశేష కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్సార్ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు.

YS Sharmila’s responsibilities as AP PCC chief today

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా అభివృద్ధిలో పట్టుమని పది అడుగులు కూడా ముందుకు పడలేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలోనూ అటు టీడీపీ, ఇటు వైసీపీ.. రెండు పార్టీలు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు సాగిలపడి వంగి మరి దండాలు పెట్టాయని..కానీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర శ్రేయస్సు కోసం మోదీని ఎదిరించలేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news