TTD : శ్రీవాణి ట్రస్టు ద్వారా 3,615 ఆలయాల నిర్మాణం

-

తిరుమల శ్రీవారికి చెందిన టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా 3,615 ఆలయాల నిర్మాణం, పలు ఆలయాల జీర్ణోద్దరణ చేపట్టామని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆలయాల నిర్మాణంపై ఈవో సమీక్ష నిర్వహించారు.

Construction of 3,615 temples by Srivani Trust

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 1,500 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన ఆలయాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికీ పూర్తి చేయాలని అధికారులను కోరారు. రాష్ట్ర దేవాదాయశాఖ 1973 ఆలయాలను నిర్మించినట్టు వివరించారు. సమరసత సేవ ఫౌండేషన్ 320 ఆలయాల నిర్మాణం చేపట్టిన 307 ఆలయాలను పూర్తి చేసిందని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజలు కమిటీలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే ఆలయాల నిర్మాణానికి ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news