అమరావతి : చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని పై కొత్త వివాదంలో చిక్కుకుంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనిది రజక కులం కాదని చెబుతున్నాయి పలు రజక సంఘాలు. విడదల రజనీకి రజక కోటా కింద మంత్రి పదవి ఇస్తే రజకుల మనోభావాలు దెబ్బతింటాయని రజక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రజక కులం కాని వ్యక్తికి, రజక కులం కోటా కింద మంత్రి పదవి ఇవ్వటం సరికాదని రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు అంజిబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డికి రజక సంఘాల ఐక్యవేదిక, రజక జన సేవా సంఘం, రజక రిజర్వేషన్ పోరాట సమితి బహిరంగ లేఖ రాసింది.
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి మంత్రి ఇస్తే.. రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. తమ డిమాండ్ ను అర్థం చేసుకుని.. ఆమె మంత్రి ఇవ్వకూడదని వారు లేఖలో కోరారు. కాగా.. 11 వ తేదీన ఏర్పాటు కాబోయే కొత్త మంత్రి వర్గంలో.. రజినీకి మంత్రి పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.