ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ తీవ్రరూపం దాలుస్తున్న సంగతి విదితమే. ఇదే నేపథ్యంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రజా ప్రతినిధులు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వైస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా నేడు ఆ లిస్ట్ లోకి చేరిపోయారు. వైద్య అధికారులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఇక ఈ విషయం నిర్ధారించిన తర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి ని హోమ్ క్వారంటైన్ లో ఉండమని అధికారులు సూచించారు. దింతో ఆయన పూర్తిగా హోమ్ క్వారంటైన్ కి పరిమితమయ్యారు. ఏపీలో ఇప్పటివరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ భాష, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య, విజయనగరం జిల్లా ఎస్. కోట ఎమ్మెల్యే శ్రీనివాసులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఇదివరకే కరోనా బారిన పడినవారే. ఇక నేడు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.