ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి సాధారణానికి వచ్చింది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. ఈ రోజు అత్యల్పంగా కేవలం 5 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. థర్డ్ వేవ్ తర్వాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ లో రావడం ఇదే తొలిసారి. కాగ కాసేపటి క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ బులిటెన్ ను విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 8,219 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల ఫలితాల్లో కేవలం 5 గురికి మాత్రమే.. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణ జిల్లాలో ఇద్దరికి, ఈస్ట్ గోదావరి, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అదే విధంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా 37 కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రం ప్రస్తుతం 314 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.