ఏపీలో దారుణం..11 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి ?

-

ఏపీలో దారుణం చోటు చేసుకుంది.11 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి చిన్న రావూర్ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 11 ఏళ్ల మైనర్ బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అసభ్యకర ప్రవర్తన చేశాడు. ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు.

అయితే.. భయంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది ఆ బాలిక. స్థానికుల రాకతో పరారైన వృద్ధుడు ఎస్.కె మీరావాలి…తెలంగాణకు వచ్చినట్లు సమాచారం. అయితే.. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్.కె మీరావాలిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news