వైయస్ జగన్ పరువు నష్టం దావా కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, “ఆజ్ తక్” మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మీడియా సంస్థ లపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు వైఎస్ జగన్. అదాని గ్రూప్ కు వ్యతిరేకంగా అమెరికా చేసిన నేరారోపణల వ్యవహారంలో తన ప్రమేయంపై తప్పుడు వార్తలు రాసిన సంస్థలపై పరువు నష్టం దావా వేశారు జగన్. మీడియా సంస్థలు పిటీషనర్ జగన్ పరువుకు భంగం కలిగించాయని కోర్టుకు వివరించారు వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు.
అమెరికాలో దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ కి తన పేరు లేకున్నా, పలు మీడియా సంస్థలు కట్టు కథలు రాశాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వై.ఎస్.జగన్. అయితే ఈ పరువు నష్టం దావాలో సమన్లు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు.. మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను వెంటనే తొలగించాలని కోరుతూ తాత్కాలిక దరఖాస్తు ను దాఖలు చేసారు వై.ఎస్. జగన్. ప్రచురితమైన వార్తలను, వీడియో లింకులను వెంటనే తొలగించాలని, పునరావృతమైతే తదుపరి న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ను డిసెంబర్ 16 కు వాయిదా వేసింది.