అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల మీద సమీక్ష చేసాం అని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టింది. ఇబ్బిడిముబ్బిడిగా 12.59 లక్షల కోట్లు అప్పలు చేశారు. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. అయినా కూటమి ప్రభుత్వం భయపడలేదు. ఈ రోజు వైసీపీ నాయకులు 6నెలలో ఏమి చేయలేదంటున్నారు. ఆరు నెలల్లో ఎవరు ఊహించని విధానంగా ప్రభుత్వాన్ని గాడిన పెట్టాం. కేంద్రం అందుకు సహకారం అందిస్తోంది.
కేంద్ర సహకారంతో వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ పైకి తెచ్చాము. వైసీపీ హయాంలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతికారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ వాక్ స్వాతంత్రం ఇచ్చాం. అందరూ ఆశ్చర్య పడేలా అనేక పథకాలు అమలు చేస్టున్నాం. ప్రజలకి నేడు అన్ని విధాల న్యాయం చేస్తున్నాం. గత పాలకులు వ్యవసాయాన్ని ఉరి తీశారు. అలాంటి ప్రభుత్వం ఈ నెల 13న ధాన్యం కొనుగోలుపై అధికారులకు వినత్రిపత్రం ఇస్తారంటా. నేడు ఒక్క రైతు కూడా ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదు చేయలేదు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు 20వేలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగులేక పోయినా రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని అచ్చెన్నాయుడు అన్నారు.