రియల్ హీరో జగన్..ఆయన సినిమా తీస్తే 1000 రోజులు ఆడుతుంది : డిప్యూటీ సీఎం

తిరుపతి : రియల్ హీరో జగన్..ఆయన సినిమా తీస్తే 1000 రోజులు ఆడుతుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. నవ రత్నాల లబ్ధిదారులు కూడా రాక్షస మనస్తత్వం తో చంద్రబాబు వెంట వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌ సినిమా పై చంద్రబాబు అనవసర రాజకీయాలు చేస్తున్నాడని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. అఖండ, పుష్ప, బంగార్రాజు సినిమాలు కూడా హిట్టయ్యాయి…భీమ్లా నాయక్‌ ఏం సమస్య వచ్చిందని నిలదీశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

సినిమా దెబ్బ తింటే హీరోలు… నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆగ్రహించారు. హీరోలు ఎవ్వరూ పేదలను ఆదుకుంది లేదని నిప్పులు చెరిగారు. రియల్ హీరో జగన్… ఆయన సినిమా తీయాలన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పేదల కోసం ఎంతో చేస్తుందని.. కానీ టీడీపీ నాయకులు బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.