ఉపాధి హామీ పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకంపై గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అందరికీ ఉపాధి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. చంద్రబాబు నుంచి పాలనానుభవం, పాలనా దక్షత నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
పాలనా వ్యవస్థను గత ప్రభుత్వం చిధ్రం చేసిందని…అనుభవంతో పని చేసేందుకు చంద్రబాబు, నేర్చుకోవడానికి నేను సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించేందుకే మేం ఇక్కడ ఉన్నామని… మా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే మా దృష్టికి తీసుకురండి అంటూ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే విషయంలో మా వల్ల మీరు ఓ అడుగు ముందుకు వేసేలా ఉంటుందే తప్ప.. అడుగులను ఆపే పరిస్థితి ఉండకూడదు….విభజన తర్వాత నుంచి చాలా కష్టాలు పడ్డామని గుర్తు చేశారు.