మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం రావడంతో శ్రీశైలం జన సంద్రం అయింది. కాగ శ్రీశైలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ బ్రహ్మోత్సవం కోసం 30 లక్షల లడ్డులు సిద్ధం చేశారు. అలాగే ఉచిత దర్శనాలకు 14 హాల్స్ ఏర్పాటు చేశారు. రూ.200 టికెట్ గల దర్శనం కోసం క్యూ లైన్ లకుకు 8 హాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు రూ.500 గల టికెటు దర్శనం కోసం 6 క్యూ లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. శివస్వాములకు కూడా ప్రత్యేక మైన క్యూ ను ఏర్పాటు చేశారు.
అలాగే శ్రీశైలంలో 13 వైద్య శిబిరాలు, 15 లడ్డు ప్రసాదం కౌంటర్లు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. 1500 పోలీసులతో బందోబస్తు ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాగ ఈ సారి బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు నీటి కొరత ఏర్పడనుంది. ప్రస్తుతం పాతాళ గంగ లో మెట్ల కిందకు నీటి మట్టం పడిపోయింది.