కారులో సీట్ల లొల్లి..ముంచేసేలా ఉన్నారు!  

-

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలోస్తాయో తెలియదు గాని…ఇప్పటినుంచే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. అన్నీ పార్టీలు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా స్కెచ్‌లు వేసుకుంటూ ఉన్నాయి. ఇటు మూడో సారి అధికారం దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది…ఇక వరుసగా రెండుసార్లు ఓడిపోయి అధికారానికి దూరమైన కాంగ్రెస్…మూడోసారి గెలిచి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది.

అటు బీజేపీ సైతం తొలిసారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇలా మూడు పార్టీలు అధికారమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి..ఇక ఎన్నికలు ఎప్పుడో వస్తాయో క్లారిటీ లేదు అందుకే ఇప్పటినుంచే సీట్లు ఫిక్స్ చేసే విషయంలో దూకుడుగా ఉంటున్నాయి. అయితే సీట్ల విషయంలో అధికార టీఆర్ఎస్‌లో సీట్లు విషయంలో పెద్ద లొల్లి నడుస్తోంది. ఎక్కడకక్కడే సీటు కోసం పోటీ పెరిగిపోతుంది.

ఒక సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడే పరిస్తితి ఉంది…దీంతో సీటు విషయంలో పెద్ద రచ్చ జరిగేలా ఉంది. ఇప్పటికే చాలా నియోజకవరాల్లో సీటు కోసం కారు నేతల మధ్య లొల్లి నడుస్తోంది. ఉదాహరణగా చాలా నియోజకవర్గాలని చెప్పుకోవచ్చు..ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీట్ల కోసం పోటీ ఎక్కువ ఉంది. పాలేరు, పినపాక, అశ్వరావుపేట, ఇల్లందు, కొత్తగూడెం సీట్లలో నేతల మధ్య పోటీ ఎక్కువ ఉంది. పాలేరులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల మధ్య పోటీ ఉన్న విషయం తెలిసిందే.

అటు కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావుల మధ్య లొల్లి నడుస్తోంది…ఇటు తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల మధ్య రచ్చ నడుస్తోంది. ఇక మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డిల మధ్య ఇష్యూ ఉంది. అలాగే జి‌హెచ్‌ఎం‌సి పరిధిలోని కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యే సాయన్న సీటుకు ఎర్త్ పెట్టాలని ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మన్నే క్రిశాంక్‌, గజ్జెల నగేష్‌లు చూస్తున్నారు…ఇలా ఒక సీటు కాదు చాలా సీట్లలో లొల్లి ఉంది.. ఈ లొల్లి వల్ల కారుకే నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news