ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా వరకు బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీని బలోపేతం చేయడానికి గానూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అప్రయత్నాలు చేసినా సరే పెద్దగా ఫలించడం లేదు. ఇక ఈ తరుణంలో పార్టీకి కొందరు నేతలు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో లెక్కలేని విధంగా వ్యవహరించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు పడుతుంది అనే చెప్పవచ్చు. పార్టీ నేతలను కాపాడుకోవడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు విషయంలో పార్టీ అధిష్టానం చాలా వరకు కంగారు పడింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అవును ఆయన పార్టీ మారడానికి ముందు నుంచి కూడా ఆసక్తిగానే ఉన్నారు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో ఆయన చర్చలు కూడా జరిపారు. హైదరాబాద్ లో బాలినేనిని ఆయన కలిసారు అనే వ్యాఖ్యలు ఎక్కువగానే వినిపించాయి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయనను పార్టీలో ఉంచడానికి గానూ చంద్రబాబు చాలా కష్టపడాల్సి వచ్చింది అంటున్నారు.
ఆయన గత శుక్రవారమే పార్టీ మారాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయనను కలవడం సాధ్యం కాకపోవడంతో చంద్రబాబు కలిసారు. చంద్రబాబుతో మంతనాలు జరిపి… జిల్లా పార్టీ తో పాటు రాష్ట్ర పార్టీలో కూడా మంచి పదవి ఇస్తా అని, పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినేట్ లో కీలక పదవి ఇస్తా అని చెప్పారట. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇప్పుడు మాత్రం దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరో ఎమ్మెల్యేతో కూడా చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం.