విజ‌య‌వాడ నుంచి ఇక డైరెక్టుగా సింగ‌పూర్‌, మస్క‌ట్‌ల‌కు ఫ్లైట్లు

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ నుంచి కువైట్ లేదా దుబాయ్ లాంటి దేశాల‌కు వెళ్లాలంటే హైద‌రాబాద్ లేదా చెన్నై వెల్లాల్సి వ‌చ్చేది. అదేంటి విజ‌య‌వాడ‌లో ఎయిర్‌పోర్టు ఉంది క‌దా అంటే.. అక్క‌డి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు డైరెక్టుగా ఫ్లైట్లు లేవు. దీంతో ఏపీ ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చేది. అలాంటి వారంద‌రికీ ఇప్పుడు శుభ‌వార్త వ‌చ్చింది.

 

ఇక‌పై బెజ‌వాడ నుంచి మ‌స్క‌ట్‌లాంటి దేశాల‌కు డైరెక్టుగా వెళ్లొచ్చు. ఈ క్ర‌మంలోనే గ‌న్న‌వ‌రం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి మ‌స్క‌ట్‌, కువైట్‌, సింగ‌పూర్‌కు అంత‌ర్జాతీయ స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.

జూన్ 1, 2 తేదీల్లో ఈ స‌ర్వీసుల ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఈ దేశాల‌కు విమానాలు న‌డిపేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇందుక సంబంధించిన షెడ్యూల్‌ను ఒక‌టి లేదా రెండు రోజుల్లో అధికారులు వెల్ల‌డిస్తారు. దీంతో ఏపీ ప్ర‌జ‌ల‌కు చాలా ఇబ్బందులు త‌ప్పుతాయి.