ఏపీ ప్రజలకు అలర్ట్…రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. రేపు(సోమవారం) పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ వెల్లడించారు. ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు పెన్షన్లు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. ఇక అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. “మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయింది. మెనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ. వెయ్యి పెంచి ఇస్తున్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దివ్యాంగులకు పింఛన్ రూ. 6వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్ద అందిస్తామన్నారు.