నేడు సీఎం జగన్ కలవనున్న దివ్య తేజస్వి తల్లిదండ్రులు

ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్వి తల్లిదండ్రులు నేడు విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు..హోంమంత్రి సుచరితతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను దివ్య తేజస్వి తల్లిదండ్రులు కలవనున్నారు..రెండు రోజుల క్రితం విద్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన హోంమంత్రి సూచరితను..సీఎం గారిని కలిసే ఏర్పాటు చేయాలని దివ్య కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు..

దివ్య తేజస్వి తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపించారు హోమ్ మంత్రి సూచరిత.. ఈరోజు మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్ లో విద్య కుటుంబ సభ్యులు జగన్ కలిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..హోమ్ మంత్రి సమక్షంలో కలిసి జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారు దివ్య తేజస్వి తల్లిదండ్రులు..తేజస్వి హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దూకుడుగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు.