హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక.

-

హైదరాబార్‌లో ఆర్థరాత్రి నుంచి మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది..లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు..వచ్చే కొన్ని గంటలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు..నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ను ముంచెత్తిన అతి భారీ వర్షం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోకముందే మళ్లీ వర్షం కురుస్తుండంతో నగర వాసులుల్లో ఆందోన మొదలైంది..

మంగళవారం తెల్లవారు జాము నుంచి నగర వ్యాప్తంగా అతి భారీ స్థాయిలో వర్షం పడుతోంది. వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీ.ఎన్‌.రెడ్డి, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీ నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్, మలక్‌పేట, చంపాపేట, మన్సూరాబాద్, నాగోల్‌, హబ్సిగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, రాయదుర్గం, పాతబస్తీ పరిధిలోని షేక్‌పేట, మదీనా, చార్మినార్‌, గోల్కొండ, టోలిచౌకి, లంగర్‌హౌజ్‌, మెహదీపట్నం, కార్వాన్‌, బహదూర్‌పుర, జూపార్క్‌, పురానాపూల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తుంది..తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ మళ్లీ జలమయమం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు..నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర సహాయ బృందాలను అప్రమత్తం చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news