కోల్ కతాలో డాక్టర్ పై హత్యాచారం ఘటనను నిరసిస్తూ విజయవాడ జూనియర్ డాక్టర్ల ఆందోళన చేపట్టారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విధులను బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. దాంతో నేడు ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంది. అయితే ఈ జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు పలికింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ డాక్టర్లు చేస్తన్నారు.
అలాగే ఈ అత్యాచారానికి నిరసనగా అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్ట్ రోడ్డు టవర్ క్లాక్ మీదుగా నిరసన ర్యాలీ చేపట్టారు వైద్యులు, నర్సులు. జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు డాక్టర్లు. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు భద్రత కల్పించాలని ఆందోళన చేస్తున్నారు.