అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నీలాదీయ్యాలి.. అలాంటి వారిని ప్రజలు ప్రశ్నించాలి అని ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీ కి వస్తే మాట్లాడే అవకాశం స్పీకర్ గా నేను ఇస్తాను. జగన్ ప్రతిపక్ష హోదా కోరినప్పటికీ చట్టపరిదిలో వ్యవహరిస్తామ్మన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. పచ్చదనాన్ని పెంపొందిస్తూ ప్రతి ఇంటా రెండు మొక్కలు నాటేలా ప్రభుత్వంప్రోత్సహించాలి. పచ్చదనాన్ని పెంపొందించకపోతే మానవ మనగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అని తెలిపారు.
వాతావరణం లో ప్రకృతి వైపరీత్యాల లోపం వల్లే అనేక ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. అపార్ట్మెంట్లలో కూడా చిన్నచిన్న మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో నర్సరీలోని ఏర్పాటు చేసి,తద్వారా మొక్కల పెంపకాన్ని మహిళా సంఘాలకుఅప్పగిస్తూ తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచిస్తాను. రాష్ట్రంలో 80 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. వారికి త్వరలో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తాము. రాజకీయ విలువలు, సామాజిక బాధ్యత, ప్రజా సేవా కార్యక్రమాల పట్ల ఎమ్మెల్యేలు అవగాహన కల్పిస్తాం అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు.