చంద్రబాబు దృష్టిలో జనం అంటే వారే… సమస్యలంటే అవే!

-

చంద్రబాబుకు ఏమైంది? 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రోజు రోజుకీ పతనమైపోతున్న బాబు ఆలోచనా విధానం, మాటల ధోరణి, వ్యవహారశైలిపై తమ్ముళ్ల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది! అవును… చంద్రబాబుకు ఏమైంది? చంద్రబాబు దృష్టిలో సమస్యలంటే అవేనా… ప్రజలు అంటే వారేనా? అంటూ తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు!

ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందా ఊడుతుందా అన్నది పాయింట్ కాదిక్కడ.. ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాల్సింది లేదక్కడ! అది సమస్య..!! అవును… రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ట్విట్టర్ లో బాబు & చినబాబు చెప్పుకొస్తుంటారు. కానీ.. వాటిపై పోరాటాలు చేయరు. ఏపీలో సమస్యలు కేవ్లాం విగ్రహాల ధ్వంశాలు, పోలీసు కేసులేనా.. టీడీపీ నాయకుల దృష్టిలో అవే పెద్ద సమస్యలు అయితే… జగన్ కి ఇక జీవితాంతం సీఎంగా తిరుగుండదు!

తాజాగా 175 నియోజకవర్గ నేతలతో వీడియో కాంఫరెన్స్ లో మాట్లాడిన బాబు ఎత్తుకున్న అంశాలు ప్రధానంగా మూడే మూడు! వాటిలో ఒకటి సబ్బం హరి ప్రహారీ గోడ కూల్చివేత.. ప‌ట్టాభి కారు ధ్వంసం.. క‌డ‌ప‌లో పార్టీ నేత హ‌రిప్ర‌సాద్ ‌పై 18 ఏళ్ల నాటి కేసు తిర‌గ‌తోడి అరెస్ట్ చేయ‌డం!! బాబు దృష్టిలో ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలు ఇవే… ప్రజలు అంటే వారు ముగ్గురే! అప్పుడప్పుడూ అమరావతిలో ధర్నాలు దీక్షలూ చేస్తున్న 29 గ్రామలలోని కొందరు ప్రజలు!

ఇదేనా 39.07శాతం మంది ప్రజలు ఈ మాత్రమే బాబునుంచి ఆశించడానికా బాబుని నమ్మింది! కొత్త ఓట్ల సంగతి దేవుడెరుగు.. కనీసం ఉన్నవారినైనా కాపాడుకోవాలి కదా!! ఉన్నవారిని అంటే… ఉన్న నాయకులను అని బాబు ఫీలవుతున్నారు కానీ… ఉన్నవారిని అంటే… 2019 ఎన్నికల సమయంలో టీడీపీ వెంట ఉన్న 1,23,04,668 ఓట్లు వేసిన ప్రజానికం అని బాబుకు తెలిసొచ్చేలోపు.. ఏమి జరుగుతుందో ఏమో!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news