జగన్ పై విమర్శలకు ట్రంప్ మార్కు సమాధానం!

-

చైనాలో పుట్టిన కరోనాతో ప్రపంచ దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. రోజుకు లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడించడం ఆరంభించి సుమారు ఆరు నెలలకు పైగా గడిచిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి సారిగా మాస్క్ ధరించి దర్శనమిచ్చారు. తాను మాస్క్ ను ధరించనే ధరించనని ఇప్పటివరకు భీష్మించుకొని తిరుగుతోన్న ట్రంప్.. తాజాగా మాస్క్ ధరించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇప్పటివరకు ఆయన ఎక్కడా కూడా మాస్క్ ధరించి కనిపించనేలేదు.


తాజాగా.. ఓ ఆసుపత్రిలో కరోనా సోకి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించేందుకు వచ్చిన ట్రంప్ ఓ ముదురు రంగు మాస్క్ తో దర్శనమివ్వడం అమెరికన్లకే షాక్ నిచ్చింది. ఆయనతో పాటు వచ్చిన వారంతా కూడా మాస్క్ లను ధరించారు. ఇదే విషయంపై అంటే.. మాస్క్ ను తొలిసారిగా ధరించడంపై ట్రంప్ ను మీడియా ప్రశ్నించగా.. హాస్పిటల్ లో మాస్క్ ధరించడం ఎంతో మంచిదని.. సైనికులను పరామర్శిస్తున్న ఈ సమయంలో తనకు మాస్క్ చాలా సౌకర్యవంతంగా అనిపించిందని కూడా వెల్లడించారు. అలాగే… “మాస్క్ లను ధరించడాన్ని తానెప్పుడూ కూడా వ్యతిరేకించలేదని.. అందుకు సమయం, సందర్భం ఉండాలన్నదే తన అభిప్రాయమని” వివరించారు.

విచిత్రం ఏమిటంటే… సోషల్ మీడియా వేదికగా ఒక వర్గం బ్యాచ్… జగన్ పై కూడా “మాస్క్ ధరించడం లేదు” అంటూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ మాత్రం అందుకు సరైన చర్యలు తీసుకుంటూనే పరిపాలన సాగిస్తున్నారు… 104 – 108ల ప్రారంభోత్సవంలో భాగంగా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా మాస్క్ ధరించి కనిపించారు. మాస్క్ లను ధరించడాన్ని తానెప్పుడూ కూడా వ్యతిరేకించలేదని.. అందుకు సమయం, సందర్భం ఉండాలన్నదే తన అభిప్రాయమని ట్రంప్ చెప్పడం… జగన్ పై వస్తున్న విమర్శలకు కూడా పరోక్ష సమాధానం అని పలువురు ఈ సందర్భంగా నెట్ లో పనిపెట్టుకున్నారు!

కాగా కరోనా వైరస్ పై ట్రంప్ వరుసబెట్టి చైనీస్ వైరస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి కూడా చైనానే కరోనా వైరస్ ను సృష్టించి ప్రపంచంపై వదిలిందని.. దాంతో లక్షల మంది కరోనా బారిన పడి మృత్యువాత పడటం శోచనీయమని వెల్లడిస్తున్నారు. అయితే… కరోనా కేసుల విషయంలో అమెరికా ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఒక్క అమెరికా దేశంలోనే ఈ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 1.34 లక్షల మందికి పైగా మృత్యవాత పడ్డ విషయం ఆందోళన కలిగించే అంశమే.

Read more RELATED
Recommended to you

Latest news