ఆంధ్రప్రదేశ్ ప్రజలని వరదలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ముఖ్యంగా విజయవాడలో భారీ వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ప్రభుత్వానికి మద్దతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం కొంతమంది చిన్నారి విద్యార్థులు కూడా తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
విజయవాడలో వరద బాధితులకు పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విరాళం అందించారు. అయితే పాకెట్ మనీని వరదసాయంగా ఇవ్వడం పై ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఆ చిన్నారులకు అభినందనలు తెలిపారు. చిన్నారులు తమ పాకెట్ మనీని వరద సాయం కోసం ఇస్తున్న వీడియో చూస్తే చాలా సంతోషం వేసిందని అన్నారు చంద్రబాబు.
ఈ చిన్నారులు వరద సాయం అందించే విషయంలో పెద్ద మనసు చేసుకున్నారని అన్నారు. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాతమైన విలువలను పెంపొందించేలా చేసిన పాఠశాల యాజమాన్యాన్ని సైతం అభినందించారు. బాధితుల పట్ల శ్రద్ధ వహించాలని బోధించడం ఇప్పటి తరానికి చాలా అవసరం అన్నారు చంద్రబాబు. ఇలాంటి సంఘటనలే మానవత్వం పై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయని అన్నారు.
https://x.com/ncbn/status/1833090947632005346