ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో నీట మునిగింది జగనన్న కాలనీ. పంట పొలాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఏలేరు కాలువకు భారీ గండి పడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలో ఉంటున్నారనే విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ హుటాహుటిన గొల్లప్రోలు ప్రాంతానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు.
వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని, వరద బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని తెలిపారు. జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కాలువల్లో పూడిక తీయలేదన్నారు. ఎవ్వరూ చేశారు.. ఏం చేశారనేది మాట్లాడితే పొలిటికల్ గా ఉంటుందని.. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు పవన్ కళ్యాణ్.