ఆంధ్రప్రదేశ్ లో అమరావతి లోని సికె కన్వెన్షన్ హాల్లో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త ాను పంచాయతీ రాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు. పల్లెల్లో ఉండటం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. పల్లె నిధులు వాటికే ఉపయోగించాలని చెప్పారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
బిల్లులు రాక పోయిన పనులు చేసిన గుత్తేదారులకు డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మందికి పైగా శ్రామికులు నిధులు ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని సూచించారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ పాలన పై నిప్పులు చెరిగారు.