లాక్ డౌన్ పూర్తిగా ఎత్తే హక్కు జగన్ కే ఉంది?

-

లాక్‌ డౌన్‌ ను పూర్తిగా ఎత్తివేస్తే కరోనా వైరస్‌ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తాయని ఎయిమ్స్‌ నేతృత్వంలో చేపట్టిన అధ్యయనం హెచ్చరించింది. కోవిడ్‌-19 కేసులు ముమ్మర దశకు చేరిన మీదట విస్తృతంగా టెస్టులు నిర్వహించిన అనంతరమే లాక్‌ డౌన్‌ ను పూర్తిగా ఎత్తివేయడంమేలని ఎయిమ్స్‌ వైద్యుల నేతృత్వంలో సాగిన అధ్యయనం పేర్కొంది. ఈ విషయంలో జగన్ సర్కార్ ఎప్పటినుంచో ముందుందనే చెప్పాలి.

కరోనా విషయంలో జగన్ కు అవగాహన లేదని… పెరుగుతున్న పాజిటివ్ కేసులకు, పెరుగుతున్న టెస్టులు కూడా కారణమని గుర్తించక ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. అయినా కూడా జగన్ సర్కార్ టెస్టుల విషయంలో వెనక్కి తగ్గి.. కేసులు తగ్గాయి అని ఆత్మవంచన చేసుకుంటూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలని అనుకోలేదు. అందుకే కేసులు పెరుగుతున్నాయని ఎన్ని విమర్శలు వచ్చినా… టెస్టుల సంఖ్యలు పెంచుకుంటూనే వెళ్లింది. ఇప్పుడు ఎయిమ్స్‌ అధ్యయనం చెబుతుంది కూడా అదే!

అవును… అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించిన తర్వాతే లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేయడం మేలని చెబుతున్నారు ఎయిమ్స్‌ వైద్యులు! ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడులక్షల డెబ్బై వేలకు పైగా కరోనా టెస్టులు చేసింది. ఈ లెక్కన చూసుకుంటే… పదిలక్షల జనాభాకు సగటున 6,980 పరీక్షలు నిర్వహించినట్లు లెక్క. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మొదటి స్థానం!

పదిలక్షల మందికి జనాభాకు సగటున 6,223 పరీక్షలతో తమిళనాడు రెండో స్థానంలో, 5,127 సగటుతో రాజస్థాన్ మూడోస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ సగటు ఇలా ఉండగా… తమిళనాడులో 21,184 పాజిటివ్ కేసులు, రాజస్థాన్ లో 8,617 కేసులు నమోదవగా.. ఏపీలో 3,571 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే జగన్ ప్రభుత్వం కరోనా విషయంలో ముందస్తు జాగ్రత్తలు, అడ్వాన్స్డ్ ఆలోచనలు చేసినట్లేనని కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఆ సంగతులు అలా ఉంటే… దేశంలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 8,380 మంది కోవిడ్‌–19 బారినపడినట్టు, అదే 24 గంటల్లో 193 మంది మరణించినట్లు తేలింది. దీంతో భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 1,82,143కు చేరుకుంది. అదేవిధంగా, ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,164 మంది మృతి చెందారని కేంద్రం తెలిపింది. కేసుల సంఖ్య రీత్యా భారత్‌ ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news