ఒకప్పుడు కోలీవుడ్ లో హీరోగా నటించి ఇప్పుడు తెలుగులో విలన్ గా రాణిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈయన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లి పతాకం పై నిర్మిస్తున్న జవాన్ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా, ప్రియమణి కీలక పాత్రలో పోషిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే కూడా అతిథి పాత్ర పోషించబోతోంది.
ఇదిలా ఉండగా ఈనెల 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలల్లోనే పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామని.. అయితే కరోనా కారణాలవల్ల మూడేళ్లు పట్టింది అని చిత్ర బృందం వెల్లడించారు.
ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. షారుక్ ఖాన్ తో కలిసిన నటించడం మంచి అనుభవం.. నేను పాఠశాలల్లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే అది వన్ సైడ్ లవ్ మాత్రమే.. ఆ అమ్మాయి మాత్రం నేను షారుక్ ఖాన్ వీరాభిమాని అని తెలిసి కూడా ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అప్పటినుంచి షారుక్ ఖాన్ పై పగ పెంచుకున్నాను. అయితే ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నాను అంటూ సరదాగా తెలిపారు విజయ సేతుపతి. ఇకపోతే ఇదే విషయంపై షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. నటుడు విజయ్ సేతుపతి ముందు చెప్పినట్లుగా నాపై ప్రతికారాన్ని తీర్చుకోలేరు. దానికి కారణం ఆయన నాకు వీరాభిమాని అంటూ తెలిపారు. ఇక జవాన్ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నాను అని కూడా షారుక్ ఖాన్ తెలిపారు.