జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి ఆక్వా రైతుకూ విద్యుత్ సబ్సిడీ

ఆక్వా రైతులకు శుభవార్త జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో 4 వేల ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ప్రారంభం కానున్నాయని తెలిపింది సర్కార్‌. ఆక్వా సాధికారత మంత్రుల కమిటీ సమావేశం అయింది. ఏపీ సచివాలయంలోని బ్లాక్ 3 లో ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం హాజరయ్యారు. మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ఏర్పాటు కానున్నట్లు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఆక్వా సాధికారత కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ‘ఆక్వా రైతులకు సీడ్ ఫీడ్ రేట్లు శాస్త్రీయంగా నిర్ణయించడం, ధరల స్థిరీకరణ లాంటి అంశాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతి రైతుకు విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నాం. నష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. రాష్ట్రంలో అక్వా ఉత్పత్తుల వినియోగం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని..రాష్ట్రంలో పలు చోట్ల ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్ ఉన్నాయన్నారు. ఆక్వా సీడ్, ఫీడ్ రేట్లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని.. అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశీయ మార్కెట్ లోనూ విస్తరించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం ఉందని..సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు మార్గదర్శకాల రూపకల్పన చేస్తామని వెల్లడించారు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?