టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. విజయనగరం జిల్లాలో సైకిల్ పార్టీకి ఎదురుదెబ్బ

 

విజయనగరం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను ఆమె పంపారు. శోభారాణి గతంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. గత కొంతకాలంగా శోభారాణి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె టీడీపీని వీడుతున్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే శోభారాణి కూతురు స్వాతి వైసీపీలో ఉన్నారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు శోభారాణికి సహకరించడంలేదని సమాచారం. అందుకే నియోజకవర్గంలో జరిగే టీడీపీ కార్యక్రమాలకు ఆమె హాజరుకావడంలేదట. ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరిపోయారు. తాజాగా శోభారాణి టీడీపీని వీడారు. మరి ఆమె వైసీపీలో చేరుతారా…? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక గత ఎన్నికల్లో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారారు. తాజాగా గెలిచిన కార్పొరేటర్లు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు పార్టీపై దృష్టి పెట్టాలని, వలసలను అడ్డుకోవాలని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.