ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ బయటుండాలి : సీఎం జగన్

-

ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ బయటుండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. రాప్తాడు వైసీపీ సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. గత ఎన్నికల్లో చీపుర్లతో ఊడ్చి టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు. ఈ ఎన్నికల్లో అవికూడా రావు అన్నారు. సంక్షేమ పథకాలు అన్ని కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలి అన్నారు. 31లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది అన్నారు.

ప్రతీ అక్క చెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం. పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలన్నారు సీఎం జగన్. మన పిల్లలు ప్రపచ స్థాయికి ఎదిగేలా విద్యావ్యవస్థ మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తీసుకొచ్చాం. ఒకసారి ఆశీర్వదిస్తే ఇంత మంచి చేస్తాం.. మరీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేదు అని ప్రశ్నించండి అని కోరారు. 

Read more RELATED
Recommended to you

Latest news