వచ్చే ఎన్నికల్లో విశ్వసనీయతకు, వంచనకు ఈ రెండు సిద్దాంతాల మధ్యే యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. రాప్తాడు వైఎస్సార్ సీపీ సిద్ధం భారీ బహిరంగ సభలో మాట్లాడారు జగన్. రెండు సిద్దాంతా మధ్య యుద్ధం.. సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ.. నేడు అనంతపురం జిల్లా రాప్తాడు లో జనసముద్రం చూడవచ్చు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు. ఎగొట్టేవాడు.. రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మేనిఫెస్టో మాయం చేసి.. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం అయినా ఇస్తానంటాడు.
మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నాడు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశాడా..? చంద్రబాబు చేసేవన్నీ మోసాలే. చెప్పేవన్నీ అబద్దాలే.. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిన్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసి టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలంటూ చురకలు అంటించారు సీఎం జగన్.