ఇటీవల సీఎం జగన్ దగ్గర గుక్క తిప్పుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఆ స్కూల్ పాస్ పర్సంటేజీ 57% అని, ఇదేనా వాళ్ళ ఇంగ్లీష్ అని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన కొడాలి నాని” ఈ పిల్లలు చేసిన పాపం ఏంటి? కలలు కనడమా? పండగ రోజు పబ్ లో అర్ధరాత్రి పూట తిరిగారా? చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఏమైనా తిట్టారా?
ఈ అమ్మాయి చేసిన తప్పేంటి?. మంచిగా ఇంగ్లీషులో మాట్లాడడమా? మీరు బతికేది హైదరాబాదులో.. సినిమాలు విడుదల చేసుకునేది ఏపీలో.. సోమ్ము చేసుకునేది ఏపీలో .. తెలంగాణలో ఎంత పెద్ద సంఘటన జరిగినా ఒక పోస్టు వేయని మీరు.. ట్రోల్స్ చేసేది మాత్రం ఆంధ్రాలో బతికే చిన్న పిల్లలమీదనా..? స్టార్స్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే ట్రోల్ చేయరు ఎందుకు.? పేద వాళ్ళ మీద జోకులు వేస్తే అడిగేవాళ్లు లేరు అనుకుంటున్నారా? అని మండిపడ్డారు కొడాలి నాని.
దమ్ము ధైర్యం ఉంటే మాతో పోరాడండి. pic.twitter.com/edN3fPCjst
— Kodali Nani (@IamKodaliNani) June 8, 2022