గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.. ఎవరెవరు ఎన్ని రోజులు గడప గడపకు వెళ్ళారో గణాంకాల రిపోర్ట్ ను బహిర్గతం చేసారు. జీరో పెర్ఫార్మెన్స్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. స్వయంగా వెళ్ళకుండా తమ ప్రతినిధులతో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అందరూ స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసిన సీఎం.. గడప గడపను సీరియస్ గా తీసుకోవాలన్నారు. పని తీరు మెరుగు పరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని మరోసారి హెచ్చరించారు సీఎం జగన్. గడప గడపను టచ్ చేయటం లో మొదటి స్థానంలో చీఫ్ విప్ ప్రసాద్ రాజు నిలబడ్డారని.. 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామన్నారు. వంద శాతం చేయటం ఎవరికీ సాధ్యం కాదు.. చేయలేక పోయిన అంశాలను ఎందుకు చేయలేకపోయామో ప్రజలకు వివరించండని ఆదేశించారు సీఎం జగన్