ఆంధ్ర ప్రదేశ్ లో కురిసిన వర్షలతో విహాయవాడ వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుండి వర్షాలు తగ్గడంతో వరద కూడా కొంత మేర తగ్గింది. దాంతో వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసింది నగర పురపాలక శాఖ. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు సిబ్బంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఇందులో పాల్గొంటుంది.
అయితే వీలైనంత త్వరగా క్లిన్ చేయడానికి ఇతర మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. ఈ సాయంత్రం 4 గంటలవరకూ రోడ్ల పై చెత్తను తొలగించేందుకు మొత్తం 4498 మంది కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. అలాగే 48 ఫైర్ ఇంజన్ ల ద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు సిబ్బంది. వీలైనంత త్వరగా నగరంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా సహాయక చర్యలు అందిస్తుంది ప్రభుత్వం. మొత్తం 149 సచివాలయాల పరిధిలో ఉన్న 32 వార్డులు వరద ప్రభావంకు లోనైనా విషయం తెలిసిందే.