Flooded milk factory in Vijayawada: విజయవాడలో పాల ఫ్యాక్టరీ నీట మునిగింది. దీంతో విజయ పాల ఫ్యాక్టరీలోకి పెద్ధ ఎత్తున చేరింది నీరు. నీరు చేరడంతో విజయ పాల ఉత్పత్తి నిలిచిపోయింది.
కొత్త యూనిట్ నుంచి ప్రస్తుతం నగరానికి పాలను సరఫరా చేస్తోంది విజయా డెయిరీ.
పాల ఫ్యాక్టరీలోని మిషనరీలోకి చేరాయి నీరు. దీంతో విజయ డెయిరీకి కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇక అటు కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలుగా ఉంది. నదీ పరీ వాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని… కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని కోరారు వి పత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్.