ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. చంద్రబాబు ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతుంది. అయితే ఈ దూకుడులో కూటమికి చెందిన మాజీ ఎంపీ… ఇరుకునపడ్డారు. ఆయన ఎవరో కాదు బిజెపి మాజీ ఎంపీ జివిఎల్ నరసింహారావు. ఆయన లిక్కర్ స్కాం లో ఇరికినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ అంశం ఏపీ తో పాటు ఢిల్లీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయింది.
బిజెపి నేత అయి ఉండి ఏపీ లిక్కర్ స్కాం లో ఇరుక్కున్నారట. తాజాగా.. అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు నాయుడు… శ్వేత పత్రం ప్రవేశపెట్టిన సమితి తెలిసిందే. ఈ శ్వేత పత్రం పెట్టిన నేపథ్యంలో… బిజెపి మాజీ ఎంపీ జివిఎల్ నరసింహారావు దొరికిపోయినట్లు చెబుతున్నారు.
ఏపీ లిక్కర్ స్కాం లో… జీవీఎల్ నరసింహారావు ఇరుక్కున్నట్లు… వార్తలు వస్తున్నాయి. ఎల్లో మీడియా కూడా ఇదే ప్రచారాన్ని చేస్తోంది. వైసీపీ ఎంపీ తో కలిసి… లిక్కర్ దందా చేశారట జీవీఎల్. దాదాపు 40 కోట్ల వరకు బిజెపి మాజీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ఖాతాలోకి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే.. దీనిపై నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.