ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఇంతసేపు నిద్ర పోవాల్సిందే..!

-

నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తగిన నిద్ర చాలా అవసరం. తగిన నిద్ర లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రోజు తగిన నిద్ర ఉండటం చాలా అవసరం. ఇక 18-60 సంవత్సరాల వయస్సు గల పెద్దలు ప్రతిరోజూ కచ్చితంగా కనీసం 7 గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలని కొత్త నివేదిక వెల్లడించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, రోజువారీ సిఫార్సు చేసిన నిద్ర గంటలనేవి మన వయస్సు ప్రకారం గణనీయంగా మారుతూ ఉంటాయి.

CDC తెలిపినట్లు మన వయస్సు ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలంటే..

  • నవజాత శిశువులు (0-3 నెలలు): 14-17 గంటలు
  • శిశువులు (4-12 నెలలు): 12-16 గంటలు
  • పసిబిడ్డలు (1-2 సంవత్సరాలు): 11-14 గంటలు
  • ప్రీస్కూలర్లు (3-5 సంవత్సరాలు): 10-13 గంటలు
  • పాఠశాల వయస్సు పిల్లలు (6-12 సంవత్సరాలు): 9-12 గంటలు
  • టీనేజర్స్ (13-17 సంవత్సరాలు): 8-10 గంటలు
  • పెద్దలు (18-60 సంవత్సరాలు): 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ
  • పెద్దలు (61-64 సంవత్సరాలు): 7-9 గంటలు
  • 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు: 7-8 గంటలు కచ్చితంగా ప్రతి రోజూ నిద్ర పోవాలి.

చిన్న పిల్లలు ఎలాగో తగినంత నిద్ర పోతారు కాబట్టి.. టీనేజర్లు, 20 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు దాటిన పెద్దలు కచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. లేదంటే మైగ్రెన్, షుగర్, బీపీ, మతిమరుపు, అతి బద్ధకం లాంటి చాలా సమస్యలు వస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు తగినన్ని గంటలు నిద్రపోకపోతే కచ్చితంగా వారికి పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యంగా పుడతారు. అలాగే సరిగ్గా నిద్రపోనీ వారికి చర్మంలో మార్పులు వచ్చి ముసలి వారిలా కనిపిస్తారు.మంచి నిద్ర మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది. నిద్ర అధిక ఆకలిని నియంత్రిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఇంకా అధిక బరువు ఉంటే తగ్గడానికి దారితీస్తుంది.

తగినంత నిద్ర పొందడం వల్ల ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవచ్చు. నిద్ర భావోద్వేగాలను నియంత్రించడంలో, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి నిద్ర మెరుగైన మానసిక శ్రేయస్సుకు దారితీస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, హృదయనాళ పనితీరును నిర్వహించడంలో నిద్ర పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులు రాకుండా మంచి నిద్ర కాపాడుతుంది. తగిన నిద్ర శ్రద్ధ, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version