మాజీ సీఎం జగన్‌ కు తీవ్ర అస్వస్థత..?

-

మాజీ సీఎం జగన్‌ కు తీవ్ర అస్వస్థత నెలకొందని వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…కాలి నొప్పితో బాధపడుతున్నారట. గతంలో కాలు బెనికి ఇబ్బంది పడ్డారు మాజీ సీఎం జగన్. ఇక నిన్న కడప నుండి పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువ సేపు కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్న క్రమంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలు బెనికిందని సమాచారం.

పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఎక్కువ సేపు నిలబడి ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలా ఎక్కువ సేపు నిలబడటం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలుకు వాపు వచ్చిందట. దీంతో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహాలు ఇచ్చారు. ఈ రోజు వాపు అలాగే ఉంటే మధ్యాహ్నం లోపు విజయవాడకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విజయవాడకు వెళ్లిన తర్వాత ఆస్పత్రికి జగన్‌ వెళ్లే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news