దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవతున్న నీట్ యూజీ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. నీట్ యూజీ పరీక్ష లీకేజీపై పూర్తిస్థాయి విచారణ కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
‘అవకతవకలపై కొన్ని ఫిర్యాదులతోపాటు మోసం, మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగినట్లు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. సమగ్ర సమీక్ష తర్వాత దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ నిర్ణయానికి కంటే ముందు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) ఛైర్మన్, ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించింది. అలాగే ఎన్టీఏ సంస్కరణల ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ వ్యవహారం వెనుక ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియా పేరు ప్రధానంగా వినిపించింది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.