తాడేపల్లి నుంచి కాన్వాయ్ ద్వారా గుంటూరు మిర్చి యార్డుకు బయలుదేరారు మాజీ సీఎం జగన్. తాజాగా గుంటూరు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. తమకు ఎన్నికల కోడ్ వర్తించదని వెల్లడించారు సీఎం జగన్.
జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మిర్చి యార్డు వద్ద మాజీ సీఎం జగన్ ను చూసేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు.