భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను రద్దు చేస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ప్రభుత్వంలోని DOGE విభాగం ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా..ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
భారత్ వద్ద చాలా డబ్బు ఉందని.. అంత మొత్తం తామెందుకు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. భారత్, ప్రధాని నరేంద్రమోదీ పట్ల తనకు చాలా గౌరవం ఉందని పేర్కొన్న ట్రంప్.. 21 మిలియన్ డాలర్లు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.కాగా, భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే.. అధికార బీజేపీ ప్రతిపక్షానికి ఆ నిధులు వెళ్తున్నాయని కౌంటర్ అటాక్ ప్రారంభించింది.