తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు నగరం వెంకటేశ్వర పురంలో ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ పర్యటించారు.
ఈ సందర్భంగగా ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ… సీఎం జగన్ ను నేరుగా ఎదుర్కొనలేక చంద్రబాబు..పవన్ కళ్యాణ్ లు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఎవరు..ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు వారి మీద వారికే నమ్మకం లేదని నిప్పులు చెరిగారు. పొత్తుల గురించి మాట్లాడుతున్నారంటే జగన్ ఎంత బలవంతుడో అర్థం అవుతుంది…. సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో జగన్ నిలిచిపోయారని వెల్లడించారు. ఎపుడో జరిగిన ఘటన లను ఇప్పు డు వైరల్ చే స్తూ కొన్ని ఛానళ్లు ఆనందం పొందుతున్నాయని ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు.