మాజీ మంత్రి వెళ్ళంపల్లికి నిరసన సెగ..కబ్జా చేశారని ఓ మహిళ !

మాజీ మంత్రి వెల్లంపల్లి, ఓఎస్డి అశోక్, పెరుమాళ్ల కాశి రావు తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టింది ఓ మహిళ. ఏలూరు రోడ్డు అప్సర థియేటర్ సమీపంలో ఈ ఆందోళన చేపట్టింది. తమని బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. మద్యం మత్తులో తమ కొడుకు వద్ద బలవంతంగా జిపి రాపించుకున్నారని ఆరోపించింది. వివాదం కోర్టులో ఉండగా ఇళ్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు అంటుంది.

తమని బిల్డింగ్ ఖాళీ చేయాలని, లేదంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపించింది బాధితురాలు. మాజీ మంత్రి వెల్లంపల్లి అనుచరులు నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటుంది బాధితురాలు.పోలీసులు కూడా వెల్లంపల్లి అనుచరులకు వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.