BREAKING : ఏపీలో 31 కొత్త జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి శంకుస్థాప‌న‌

-

ఏపీ రహదారులకు మహర్దశ వచ్చింది. ఇవాళ ఏపీలోని ఏకంగా 31 కొత్త జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి శంకు స్థాప‌న‌ చేసింది జగన్ మోహన్ ప్రభుత్వం. ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి తో పాటు శంకుస్థాప‌న‌లో పాల్లొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారి. మొదటగా బెజ‌వాడ బెంజ్ స‌ర్కిల్ ఫ్లైఓవ‌ర్ 2 ప్రారంభించారు సిఎం జగన్.

ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోడీ, నితిన్ గ‌డ్కారీకి ధ‌న్య‌వాదాలు చెప్పారు. 51 ప్రాజెక్టుల‌కు ఇవాల్టి తో ముంద‌డుగు ప‌డుతోందని పేర్కొన్నారు. రూ. 10,400 కోట్లతో ర‌హ‌దారుల ప‌నులకు శంకుస్థాప‌న‌ చేశామని వెల్లడించారు సిఎం జగన్.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల విలువైన 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోందన్నారు. గడ్కరీ గారి సహకారంతో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ వేగంగా పూర్తయిందని వెల్లడించారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news